head

Tuesday, September 13, 2011

Dream - Life

కమ్మని కలలకు

కనులు పలికెను స్వాగతం,

నిదురమ్మ ఒడిలో!

వెచ్చని సూర్య కిరణాలూ

కనుపాపను తాకెను,

ఉషోదయ వేళలో!


గడచిన రాత్రి స్వప్నాలు,

జీవిత పయన చిహ్నాలు.

తీయని కలలు - మధుర జ్ఞాపకాలు!

పీడ కలలు - చేదు అనుభవాలు!!


కల ఎదైనా, కలత నిదురైనా

కునుకమ్మ కౌగిట కరగక మానదు.

వెన్నెల రేఐనా, కాళ రాత్రియిన

తెలవారే వెలుగుకి తలవంచక తప్పదు.

ఏది ఏమైనా, ఎంత కష్టమైనా

జీవిత పయనం ఆగదు...!


Friday, September 2, 2011

Victory

మబ్బున దాగిన సూరీడు,
మరల ప్రకాశించును.
క్రింద పడిన కెరటం,

తిరిగి తీరాన్ని తాకును.

ఓటమి ధాటికి
తలవంచి ఓడిపోక,
ధైర్యమే నీ ఆయుధమై
ఎదురీది పోరాడు.

అపజయం క్షణికం!
విజయం శాశ్వతం!!

Tuesday, August 30, 2011

నీలి మేఘం వర్షించగా..

నీలి మేఘం వర్షించగా..

చెట్లు చిగురించెను.

ఉరుములు మెరుపులు గద్ధించగా..

భూమాత దద్ధరిల్లును.

ప్రకృతి అందం ఇనుమడింపచేసేదీ వర్షమే!

ప్రకృతి భీభత్సం సృష్టించినా వర్షమే!

ఒక చినుకురైతుముఖాన చిరునవ్వు పూయించును.

పది చినుకులుపచ్చని పయిరును పెంపొందించును.

వందల వేల చినుకులు భూమాత ఒడిలో ఒదిగిపోవును.

లక్షల కోట్ల చినుకులువాన దారి మార్చి వరదఅయితే?

రైతు కన్నుల్లో కన్నీరు నింపును,

పంట పొలాల్ని సమాధి చేయును,

భూమాత హ్రిదయాన్ని గాయపరుచును.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించక మునుపే,

కరువు కాటకాలు విలయ తాండవం చేయకమునుపే

చేయి చేయి కలుపుదాం.. చెట్లను నాటుదాం

ప్రకృతి ఒడిలో సేద తీరుదాం .. వరుణ దేవుని కరుణకై వేడుకుమ్దాం