head

Saturday, August 11, 2012

My Love


నడచి వచ్చే దీపమై ..
నవ్వులు  పంచె రూపమై ..             
వేయి జన్మల  వరమై ..
కోటి  జన్మలకు ప్రేయసివై ..
నడిచి  రావే ప్రియతమా ..!
నిలిచిపోవే  ప్రణయమా    ..!!

హృదయమే  లేదనుకున్న నాకు ,
మనసుందని తెలిపావు .
శిలలా మిగిలిన బ్రతుకుకు ,
ప్రాణం పోసావు .
నా కంటి కలల వరమై ..
కాన రాని కలవరమై ..
కదిలిరావే, 
కలల అడుగున దాగిన సత్యమా ..!
కలిసిరావే  , 
కడలి కడుపున దాగిన ముత్యమా ..!!          

చీకటి చూసే కనులకి ,
వెలుతురు ఉందని చూపావు .  
అమావాస్య  అలవాటైన  జీవితానికి ,       
వెన్నెల వెలుగులు  పంచావు .
మరువలేని మధుర స్వప్నమై ..
మోయలేని తీయని భారమై ..
చెదిరిపోకే , 
చెంత చేరలేని  తీరమా   ..!
చేరరావే ,
చింత తీర్చే  నా ప్రాణమా    ..!!   

Monday, March 19, 2012

My Angel..


స్వర్గం నుండి దారి తప్పిన దేవకన్య
భువి పైన వెలసింది ,
నా కంట కనిపించిది .

కనుబొమ్మ విల్లువంచి ,
చూపు చూసింది.
చిరునవ్వు సంధించి ,
యద గాయం చేసింది .

కోయిలమ్మ
కంటంతో ,
మాట పలికింది .
నెమలి నడకలతో ,
తన మాయలో పడేసింది .

పాలు
తేనెలు రంగరించి ,
చందన సుగంధాల పరిమళమద్ది ,
అందాన్నే పోతగా పోసిన
ప్రాణమున్న పాలరాతి బొమ్మ ...
నిను చేరేది ఎన్నడమ్మ ..!
నా ప్రాణం నువ్వేనమ్మా ..!!

Friday, March 16, 2012

Summer Time


వేసవి ..
మండే ఎండలతో పాటు
చెమటని , సత్తువని పిండేసే కాలమైంది.

కరెంటు కోతలు ఒక పక్క !
ఉక్కపోతలు మరో పక్క !!
వడ దెబ్బలు ఒక పక్క !
ఆసుపత్రి బిల్లులు మరో పక్క !!

భానుడి ప్రతాపం పెరిగి పెరిగి ,
రవి కిరణమే మరణ కారణమైంది ...
మనుషులకి చల్లని గాలి కరువు ,
జంతువులకి త్రాగే నీరు కరువు ,
వేసవికి వెన్నెల రేయిలు -
వాన చినుకులు కరువు .

చిరుగాలికి
కరిగే మేఘనికై ,

కురిసే ముత్యపు చినుకులకై ,
ఎన్ని హృదయాలు తపిస్తున్నాయో ..!

అయినా ..
విద్యార్థులకి పరీక్షల ముగింపు ,
చిన్నారులకి ఆట విడుపు ,
బంధు మిత్రుల కలయికలు ,
సుధూర ప్రయాణాల ప్రయత్నాలు ,
అంతా వేసవికే ..!
వేసవి సెలవులకే..!!

So enjoy this Summer with your family and friends..
and

All the best to students who are preparing for their exams.

Thursday, March 15, 2012

Always With You..

ఆకాశమంత ప్రేమని ప్రేమగా పరిచిఉంచా ...
నీ ప్రపంచమంతా నేనై నిండేందుకు !

నేలా అంతా నా నవ్వులతో నిమ్పిఉంచా ...
నీ ప్రతి అడుగులో చెరగని చిరునవ్వుని నేనని చెప్పేందుకు !

వీచే గాలులలో నా ఉపిరినే ఊది ఉంచా ...
నీ చేయి తాకే చిరుగాలైనా నా శ్వాసే అయ్యేందుకు !

నువ్వు
చూసే ప్రతి చోటులో నా పేరునే రాసి ఉంచా ...
నీ పెదవి పలికే ప్రతి మాట నేనయ్యేందుకు !

నీ
కనులకి కంటి పాపనై ,
కనుపాపకి కమ్మని కలనై ,
కలలో కలల దేవతనై ,
నీ కళ్ళలోనే నా రూపాన్ని నింపి ఉంచా ...

నీ
లోకమే నేనయ్యేందుకు !
నా లోకమే నువ్వని చెప్పేందుకు !!

Tuesday, January 24, 2012

Music is the Life( Karnataka veereswara punyaasramam, Gadag)



ఆశగా ఎదురు చూసే హృదయమున్న

చూసేందుకు కన్నులు లేవు.

సహాయానికై చాచేందుకు చేతులున్నా,

నడిచేందుకు కాళ్ళు లేవు.

అంధులు - వికలాంగులు,

అనాధలు - అభాగ్యులు,

ఎవరైనా ఏమైనా..

కులమైనా, ఏ మతమైనా..

దిక్కు తోచని వారికి దారి చూపే వెలుగై

ఆధారం లేని వారికీ నీడనిచ్చే తోడై

వెలిసింది ఓ "పున్యాస్రమం".


సంగీతం వింటే శ్రవణానందం!

సంగీత వాయిద్యాలు చూస్తే నయనానందం!!

మరి సంగీతమే జీవితమైతే ?

జీవితంలో మాధుర్యమే సంగీతమైతే ??

సంగీతంతో..

హృదయ సాగరాన్ని ఉప్పొంగించి

ఓ ఆస్రమాన్నే నెలకొల్పితే....

అదే కర్నాటకలోని గదగ్లో ఉన్న "వీరేశ్వర పుణ్యాశ్రం ". ( ఫోన్ : 09483253331)

వైకల్యం లోకానికి అనర్హతే అయినా,

ఆశ్రమ ప్రవేశానికి అదే ప్రధాన అర్హత.

అంధుల జీవితంలో ఆత్మ విశ్వాసాన్ని నింపి,

వారి పూర్తి భాద్యతలని స్వీకరిస్తుంది.


ఆశ్రమంలో అడుగిడిన ప్రతి ఒక్కరికి

జీవితంలో ఏవేవో లక్ష్యాలు.

సంగీత విద్వాంసులు కొందరైతే,

ప్రభుత్వ ఉపాధ్యాయులు మరికొందరు,

సర్కారి కొలువులు సాధించినవారు ఇంకెందరో..


పండిట్ పంచాక్షరి గవై , పుట్టరాజ్ గవై

ఇలా ఎందఱో మహానుభావులు

ఆశ్రమాన్ని మాత్రమే తీర్చిదిద్దలేదు..

వైకల్యం జీవితంలో ఓటమికి కారణం కాదని చాటిచెప్పారు.

అన్నట్టూ వారు కూడా అందులే..

విజయాన్ని వరించిన వీరులే..