
నీ ప్రపంచమంతా నేనై నిండేందుకు !
ఈ నేలా అంతా నా నవ్వులతో నిమ్పిఉంచా ...
నీ ప్రతి అడుగులో చెరగని చిరునవ్వుని నేనని చెప్పేందుకు !
వీచే గాలులలో నా ఉపిరినే ఊది ఉంచా ...
నీ చేయి తాకే చిరుగాలైనా నా శ్వాసే అయ్యేందుకు !
నువ్వు చూసే ప్రతి చోటులో నా పేరునే రాసి ఉంచా ...
నీ పెదవి పలికే ప్రతి మాట నేనయ్యేందుకు !
నీ కనులకి కంటి పాపనై ,
కనుపాపకి కమ్మని కలనై ,
కలలో కలల దేవతనై ,
నీ కళ్ళలోనే నా రూపాన్ని నింపి ఉంచా ...
నీ లోకమే నేనయ్యేందుకు !
నా లోకమే నువ్వని చెప్పేందుకు !!
No comments:
Post a Comment