
వేసవి ..
మండే ఎండలతో పాటు
చెమటని , సత్తువని పిండేసే కాలమైంది.
కరెంటు కోతలు ఒక పక్క !
ఉక్కపోతలు మరో పక్క !!
వడ దెబ్బలు ఒక పక్క !
ఆసుపత్రి బిల్లులు మరో పక్క !!
భానుడి ప్రతాపం పెరిగి పెరిగి ,
రవి కిరణమే మరణ కారణమైంది ...
మనుషులకి చల్లని గాలి కరువు ,
జంతువులకి త్రాగే నీరు కరువు ,
వేసవికి వెన్నెల రేయిలు -
వాన చినుకులు కరువు .
చిరుగాలికి కరిగే మేఘనికై ,
కురిసే ముత్యపు చినుకులకై ,
ఎన్ని హృదయాలు తపిస్తున్నాయో ..!
అయినా ..
విద్యార్థులకి పరీక్షల ముగింపు ,
చిన్నారులకి ఆట విడుపు ,
బంధు మిత్రుల కలయికలు ,
సుధూర ప్రయాణాల ప్రయత్నాలు ,
అంతా ఈ వేసవికే ..!
వేసవి సెలవులకే..!!
So enjoy this Summer with your family and friends.. and
All the best to students who are preparing for their exams.
No comments:
Post a Comment