Your Ad Here

Monday, March 19, 2012

My Angel..


స్వర్గం నుండి దారి తప్పిన దేవకన్య
భువి పైన వెలసింది ,
నా కంట కనిపించిది .

కనుబొమ్మ విల్లువంచి ,
చూపు చూసింది.
చిరునవ్వు సంధించి ,
యద గాయం చేసింది .

కోయిలమ్మ
కంటంతో ,
మాట పలికింది .
నెమలి నడకలతో ,
తన మాయలో పడేసింది .

పాలు
తేనెలు రంగరించి ,
చందన సుగంధాల పరిమళమద్ది ,
అందాన్నే పోతగా పోసిన
ప్రాణమున్న పాలరాతి బొమ్మ ...
నిను చేరేది ఎన్నడమ్మ ..!
నా ప్రాణం నువ్వేనమ్మా ..!!

Friday, March 16, 2012

Summer Time


వేసవి ..
మండే ఎండలతో పాటు
చెమటని , సత్తువని పిండేసే కాలమైంది.

కరెంటు కోతలు ఒక పక్క !
ఉక్కపోతలు మరో పక్క !!
వడ దెబ్బలు ఒక పక్క !
ఆసుపత్రి బిల్లులు మరో పక్క !!

భానుడి ప్రతాపం పెరిగి పెరిగి ,
రవి కిరణమే మరణ కారణమైంది ...
మనుషులకి చల్లని గాలి కరువు ,
జంతువులకి త్రాగే నీరు కరువు ,
వేసవికి వెన్నెల రేయిలు -
వాన చినుకులు కరువు .

చిరుగాలికి
కరిగే మేఘనికై ,
కురిసే ముత్యపు చినుకులకై ,
ఎన్ని హృదయాలు తపిస్తున్నాయో ..!

అయినా ..
విద్యార్థులకి పరీక్షల ముగింపు ,
చిన్నారులకి ఆట విడుపు ,
బంధు మిత్రుల కలయికలు ,
సుధూర ప్రయాణాల ప్రయత్నాలు ,
అంతా వేసవికే ..!
వేసవి సెలవులకే..!!

So enjoy this Summer with your family and friends..
and
All the best to students who are preparing for their exams.

Thursday, March 15, 2012

Always With You..

ఆకాశమంత ప్రేమని ప్రేమగా పరిచిఉంచా ...
నీ ప్రపంచమంతా నేనై నిండేందుకు !

నేలా అంతా నా నవ్వులతో నిమ్పిఉంచా ...
నీ ప్రతి అడుగులో చెరగని చిరునవ్వుని నేనని చెప్పేందుకు !

వీచే గాలులలో నా ఉపిరినే ఊది ఉంచా ...
నీ చేయి తాకే చిరుగాలైనా నా శ్వాసే అయ్యేందుకు !

నువ్వు
చూసే ప్రతి చోటులో నా పేరునే రాసి ఉంచా ...
నీ పెదవి పలికే ప్రతి మాట నేనయ్యేందుకు !

నీ
కనులకి కంటి పాపనై ,
కనుపాపకి కమ్మని కలనై ,
కలలో కలల దేవతనై ,
నీ కళ్ళలోనే నా రూపాన్ని నింపి ఉంచా ...

నీ
లోకమే నేనయ్యేందుకు !
నా లోకమే నువ్వని చెప్పేందుకు !!

Tuesday, January 24, 2012

Music is the Life( Karnataka veereswara punyaasramam, Gadag)



ఆశగా ఎదురు చూసే హృదయమున్న

చూసేందుకు కన్నులు లేవు.

సహాయానికై చాచేందుకు చేతులున్నా,

నడిచేందుకు కాళ్ళు లేవు.

అంధులు - వికలాంగులు,

అనాధలు - అభాగ్యులు,

ఎవరైనా ఏమైనా..

కులమైనా, ఏ మతమైనా..

దిక్కు తోచని వారికి దారి చూపే వెలుగై

ఆధారం లేని వారికీ నీడనిచ్చే తోడై

వెలిసింది ఓ "పున్యాస్రమం".


సంగీతం వింటే శ్రవణానందం!

సంగీత వాయిద్యాలు చూస్తే నయనానందం!!

మరి సంగీతమే జీవితమైతే ?

జీవితంలో మాధుర్యమే సంగీతమైతే ??

సంగీతంతో..

హృదయ సాగరాన్ని ఉప్పొంగించి

ఓ ఆస్రమాన్నే నెలకొల్పితే....

అదే కర్నాటకలోని గదగ్లో ఉన్న "వీరేశ్వర పుణ్యాశ్రం ". ( ఫోన్ : 09483253331)

వైకల్యం లోకానికి అనర్హతే అయినా,

ఆశ్రమ ప్రవేశానికి అదే ప్రధాన అర్హత.

అంధుల జీవితంలో ఆత్మ విశ్వాసాన్ని నింపి,

వారి పూర్తి భాద్యతలని స్వీకరిస్తుంది.


ఆశ్రమంలో అడుగిడిన ప్రతి ఒక్కరికి

జీవితంలో ఏవేవో లక్ష్యాలు.

సంగీత విద్వాంసులు కొందరైతే,

ప్రభుత్వ ఉపాధ్యాయులు మరికొందరు,

సర్కారి కొలువులు సాధించినవారు ఇంకెందరో..


పండిట్ పంచాక్షరి గవై , పుట్టరాజ్ గవై

ఇలా ఎందఱో మహానుభావులు

ఆశ్రమాన్ని మాత్రమే తీర్చిదిద్దలేదు..

వైకల్యం జీవితంలో ఓటమికి కారణం కాదని చాటిచెప్పారు.

అన్నట్టూ వారు కూడా అందులే..

విజయాన్ని వరించిన వీరులే..



Tuesday, September 13, 2011

Dream - Life

కమ్మని కలలకు

కనులు పలికెను స్వాగతం,

నిదురమ్మ ఒడిలో!

వెచ్చని సూర్య కిరణాలూ

కనుపాపను తాకెను,

ఉషోదయ వేళలో!


గడచిన రాత్రి స్వప్నాలు,

జీవిత పయన చిహ్నాలు.

తీయని కలలు - మధుర జ్ఞాపకాలు!

పీడ కలలు - చేదు అనుభవాలు!!


కల ఎదైనా, కలత నిదురైనా

కునుకమ్మ కౌగిట కరగక మానదు.

వెన్నెల రేఐనా, కాళ రాత్రియిన

తెలవారే వెలుగుకి తలవంచక తప్పదు.

ఏది ఏమైనా, ఎంత కష్టమైనా

జీవిత పయనం ఆగదు...!


Friday, September 2, 2011

Victory

మబ్బున దాగిన సూరీడు,
మరల ప్రకాశించును.
క్రింద పడిన కెరటం,

తిరిగి తీరాన్ని తాకును.

ఓటమి ధాటికి
తలవంచి ఓడిపోక,
ధైర్యమే నీ ఆయుధమై
ఎదురీది పోరాడు.

అపజయం క్షణికం!
విజయం శాశ్వతం!!

Tuesday, August 30, 2011

నీలి మేఘం వర్షించగా..

నీలి మేఘం వర్షించగా..

చెట్లు చిగురించెను.

ఉరుములు మెరుపులు గద్ధించగా..

భూమాత దద్ధరిల్లును.

ప్రకృతి అందం ఇనుమడింపచేసేదీ వర్షమే!

ప్రకృతి భీభత్సం సృష్టించినా వర్షమే!

ఒక చినుకురైతుముఖాన చిరునవ్వు పూయించును.

పది చినుకులుపచ్చని పయిరును పెంపొందించును.

వందల వేల చినుకులు భూమాత ఒడిలో ఒదిగిపోవును.

లక్షల కోట్ల చినుకులువాన దారి మార్చి వరదఅయితే?

రైతు కన్నుల్లో కన్నీరు నింపును,

పంట పొలాల్ని సమాధి చేయును,

భూమాత హ్రిదయాన్ని గాయపరుచును.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించక మునుపే,

కరువు కాటకాలు విలయ తాండవం చేయకమునుపే

చేయి చేయి కలుపుదాం.. చెట్లను నాటుదాం

ప్రకృతి ఒడిలో సేద తీరుదాం .. వరుణ దేవుని కరుణకై వేడుకుమ్దాం

Monday, August 29, 2011

కుహు కుహు

కుహు కుహు రాగముల ఓ కోయిల ..
చేసితివే నా మది అలజడి ఎలా ?
భూమ్యాకాసముల ఘోషల
..
నీవు నన్ను చేరేది పెద్ద కల!