head

Tuesday, July 25, 2017

Love at first sight..


తొలి చూపుకి ప్రేమంటే - పిచ్చి అనుకున్న ..
ఒక నవ్వుకి పడిపోతే - ప్రేమే కాదనుకున్న..
కానీ నిన్ను చూసాకే - ఏదయినా సాధ్యమనుకున్నా ..!

ఒక చూపు బాణంతో - గుండెల్లో గుచ్చావు ,
ఆయుధం లేకుండానే - యద గాయం చేసావు .
సైన్యం లేకుండానే - మనసున ఆక్రమించావు,
నా ప్రేమ సింహాసనాన్ని - నీ సొంతం చేసుకున్నావ్.....

వేల కాంతుల వెన్నెల్లా - ఓ నవ్వు నవ్వావు ,
అమావాస్య దీనావళిలా - నాలో వెలుగులు నింపావు.
కనులు చూస్తుండగానే - కలలు దోచేసావు ,
నాకు తెలియకుండానే - నాలో నిన్ను నింపేసావ్ ...

తొలి చూపుకి ప్రేమంటే - పిచ్చి అనుకున్న ..
కాని ఆ ప్రేమ కి అర్థం - నీవని తెలుసుకున్న.
ఆ పిచ్చికి సాక్షం - నేనే అని నమ్ముతున్న..
నాలో నేనే నవ్వుకుంటున్నా ....



No comments:

Post a Comment