కలువ రేకుల కళ్ళతో ,
మరుమల్లెల నవ్వులతో ,
సిరిమువ్వల అందెలతో ..
ఆమె అందం అద్భుతం !
హంసలకు నడక నేర్పగల -
ఆమె అడుగులు,
కోయిలకు పాట నేర్పగల -
ఆమె పలుకులు ,
దేవకన్యలకు దేవతా ?
అనిపించే ఆమె సొగసులు అద్భుతం !
ఆమె స్పర్శ తగలగానే -
పూలు పులకించెను .
ఆమె అడుగిడినంతనే -
నేల నర్తించెను .
ఆమె చూపు సోకగనే -
మేఘం వర్షించెను .
ఆమె సోయగం అద్భుతం !
ఆమెలోని కాంతులకు -
రాతురులు దారి తొలగెను .
ఆమెలోని ప్రకాశానికి -
చంద్రుడు చిన్నబోయెను .
ఆమెలోని సౌందర్యానికి -
ప్రకృతి అసూయ చెందెను .
ఆమె అందం అద్భుతం .
ఆమె సోయగం అద్భుతం .
ఆమె అధ్భుతానికే అద్భుతం !!

సిరిమువ్వల అందెలతో ..
ఆమె అందం అద్భుతం !
హంసలకు నడక నేర్పగల -
ఆమె అడుగులు,
కోయిలకు పాట నేర్పగల -
ఆమె పలుకులు ,
దేవకన్యలకు దేవతా ?
అనిపించే ఆమె సొగసులు అద్భుతం !
ఆమె స్పర్శ తగలగానే -
పూలు పులకించెను .
ఆమె అడుగిడినంతనే -
నేల నర్తించెను .
ఆమె చూపు సోకగనే -
మేఘం వర్షించెను .
ఆమె సోయగం అద్భుతం !
ఆమెలోని కాంతులకు -
రాతురులు దారి తొలగెను .
ఆమెలోని ప్రకాశానికి -
చంద్రుడు చిన్నబోయెను .
ఆమెలోని సౌందర్యానికి -
ప్రకృతి అసూయ చెందెను .
ఆమె అందం అద్భుతం .
ఆమె సోయగం అద్భుతం .
ఆమె అధ్భుతానికే అద్భుతం !!
No comments:
Post a Comment