తొలిచూపుతో తీయని వల వేశావు ..
మలి చూపుతో మనసు దోచేసావు ..
కొన చూపుతో కసిరి కాటేసావు ..
ఒక చూపూతో యదని కోసేసావు ..
చిరునవ్వుతో చెలిమి నాదన్నవు ..
అర నవ్వుతో అందం నీదన్నావు ..
సిరి నవ్వుతో సిరులు కురిపించావు ..
ఒక నవ్వుతో వలపు బాణమేసావు ..
చుర చుర చూపులతో చంపేసావు ...
చక చక మనసు కాజేసావు ..
ముసి ముసి నవ్వులతో మాయ చేసావు ..
మరి మరి యదను లాగేసావు ..
పిసినారి దానివే ..
పిసరంత ప్రేమ పంచవే ..!
కయ్యాల మారివే ..
కొసరంత ప్రేమ కురిపించవే ..!
మలి చూపుతో మనసు దోచేసావు ..
కొన చూపుతో కసిరి కాటేసావు ..
ఒక చూపూతో యదని కోసేసావు ..
చిరునవ్వుతో చెలిమి నాదన్నవు ..
అర నవ్వుతో అందం నీదన్నావు ..
సిరి నవ్వుతో సిరులు కురిపించావు ..
ఒక నవ్వుతో వలపు బాణమేసావు ..
చుర చుర చూపులతో చంపేసావు ...
చక చక మనసు కాజేసావు ..
ముసి ముసి నవ్వులతో మాయ చేసావు ..
మరి మరి యదను లాగేసావు ..
పిసినారి దానివే ..
పిసరంత ప్రేమ పంచవే ..!
కయ్యాల మారివే ..
కొసరంత ప్రేమ కురిపించవే ..!
No comments:
Post a Comment