
స్వర్గం నుండి దారి తప్పిన ఓ దేవకన్య
ఈ భువి పైన వెలసింది ,
నా కంట కనిపించిది .
కనుబొమ్మ విల్లువంచి ,
ఓ చూపు చూసింది.
చిరునవ్వు సంధించి ,
యద గాయం చేసింది .
కోయిలమ్మ కంటంతో ,
ఓ మాట పలికింది .
నెమలి నడకలతో ,
తన మాయలో పడేసింది .
పాలు తేనెలు రంగరించి ,
చందన సుగంధాల పరిమళమద్ది ,
అందాన్నే పోతగా పోసిన
ఓ ప్రాణమున్న పాలరాతి బొమ్మ ...
నిను చేరేది ఎన్నడమ్మ ..!
నా ప్రాణం నువ్వేనమ్మా ..!!
No comments:
Post a Comment