నడచి వచ్చే దీపమై ..
నవ్వులు పంచె రూపమై ..
వేయి జన్మల వరమై ..
కోటి జన్మలకు ప్రేయసివై ..
నడిచి రావే ప్రియతమా ..!
నిలిచిపోవే ప్రణయమా ..!!
హృదయమే లేదనుకున్న నాకు ,
మనసుందని తెలిపావు .
శిలలా మిగిలిన బ్రతుకుకు ,
ప్రాణం పోసావు .
నా కంటి కలల వరమై ..
కాన రాని కలవరమై ..
కదిలిరావే,
కలల అడుగున దాగిన సత్యమా ..!
కలిసిరావే ,
కడలి కడుపున దాగిన ముత్యమా ..!!
చీకటి చూసే కనులకి ,
వెలుతురు ఉందని చూపావు .
అమావాస్య అలవాటైన జీవితానికి ,
వెన్నెల వెలుగులు పంచావు .
మరువలేని మధుర స్వప్నమై ..
మోయలేని తీయని భారమై ..
చెదిరిపోకే ,
చెంత చేరలేని తీరమా ..!
చేరరావే ,
చింత తీర్చే నా ప్రాణమా ..!!
No comments:
Post a Comment