
ఆశగా ఎదురు చూసే హృదయమున్న
చూసేందుకు కన్నులు లేవు.
సహాయానికై చాచేందుకు చేతులున్నా,
నడిచేందుకు కాళ్ళు లేవు.
అంధులు - వికలాంగులు,
అనాధలు - అభాగ్యులు,
ఎవరైనా ఏమైనా..
ఏ కులమైనా, ఏ మతమైనా..
దిక్కు తోచని వారికి దారి చూపే వెలుగై
ఆధారం లేని వారికీ నీడనిచ్చే తోడై
వెలిసింది ఓ "పున్యాస్రమం".
సంగీతం వింటే శ్రవణానందం!
సంగీత వాయిద్యాలు చూస్తే నయనానందం!!
మరి సంగీతమే జీవితమైతే ?
జీవితంలో మాధుర్యమే సంగీతమైతే ??
సంగీతంతో..
హృదయ సాగరాన్ని ఉప్పొంగించి
ఓ ఆస్రమాన్నే నెలకొల్పితే....
అదే కర్నాటకలోని గదగ్లో ఉన్న "వీరేశ్వర పుణ్యాశ్రం ". ( ఫోన్ : 09483253331)
వైకల్యం లోకానికి అనర్హతే అయినా,
ఆశ్రమ ప్రవేశానికి అదే ప్రధాన అర్హత.
అంధుల జీవితంలో ఆత్మ విశ్వాసాన్ని నింపి,
వారి పూర్తి భాద్యతలని స్వీకరిస్తుంది.
ఆశ్రమంలో అడుగిడిన ప్రతి ఒక్కరికి
జీవితంలో ఏవేవో లక్ష్యాలు.
సంగీత విద్వాంసులు కొందరైతే,
ప్రభుత్వ ఉపాధ్యాయులు మరికొందరు,
సర్కారి కొలువులు సాధించినవారు ఇంకెందరో..
పండిట్ పంచాక్షరి గవై , పుట్టరాజ్ గవై
ఇలా ఎందఱో మహానుభావులు
ఆశ్రమాన్ని మాత్రమే తీర్చిదిద్దలేదు..
వైకల్యం జీవితంలో ఓటమికి కారణం కాదని చాటిచెప్పారు.
అన్నట్టూ వారు కూడా అందులే..
విజయాన్ని వరించిన వీరులే..