స్వర్గం నుండి దారి తప్పిన ఓ దేవకన్యఈ భువి పైన వెలసింది ,నా కంట కనిపించిది .కనుబొమ్మ విల్లువంచి ,ఓ చూపు చూసింది.చిరునవ్వు సంధించి ,యద గాయం చేసింది .
కోయిలమ్మ కంటంతో ,ఓ మాట పలికింది .నెమలి నడకలతో ,తన మాయలో పడేసింది .
పాలు తేనెలు రంగరించి ,చందన సుగంధాల పరిమళమద్ది ,అందాన్నే పోతగా పోసినఓ ప్రాణమున్న పాలరాతి బొమ్మ ...నిను చేరేది ఎన్నడమ్మ ..!నా ప్రాణం నువ్వేనమ్మా ..!!
వేసవి ..
మండే ఎండలతో పాటు
చెమటని , సత్తువని పిండేసే కాలమైంది.
కరెంటు కోతలు ఒక పక్క !
ఉక్కపోతలు మరో పక్క !!
వడ దెబ్బలు ఒక పక్క !
ఆసుపత్రి బిల్లులు మరో పక్క !!
భానుడి ప్రతాపం పెరిగి పెరిగి ,
రవి కిరణమే మరణ కారణమైంది ...
మనుషులకి చల్లని గాలి కరువు ,
జంతువులకి త్రాగే నీరు కరువు ,
వేసవికి వెన్నెల రేయిలు -
వాన చినుకులు కరువు .
చిరుగాలికి కరిగే మేఘనికై ,
కురిసే ముత్యపు చినుకులకై ,
ఎన్ని హృదయాలు తపిస్తున్నాయో ..!
అయినా ..
విద్యార్థులకి పరీక్షల ముగింపు ,
చిన్నారులకి ఆట విడుపు ,
బంధు మిత్రుల కలయికలు ,
సుధూర ప్రయాణాల ప్రయత్నాలు ,
అంతా ఈ వేసవికే ..!
వేసవి సెలవులకే..!!
So enjoy this Summer with your family and friends.. and
All the best to students who are preparing for their exams.
ఆకాశమంత ప్రేమని ప్రేమగా పరిచిఉంచా ... నీ ప్రపంచమంతా నేనై నిండేందుకు !ఈ నేలా అంతా నా నవ్వులతో నిమ్పిఉంచా ... నీ ప్రతి అడుగులో చెరగని చిరునవ్వుని నేనని చెప్పేందుకు !వీచే గాలులలో నా ఉపిరినే ఊది ఉంచా ... నీ చేయి తాకే చిరుగాలైనా నా శ్వాసే అయ్యేందుకు !
నువ్వు చూసే ప్రతి చోటులో నా పేరునే రాసి ఉంచా ... నీ పెదవి పలికే ప్రతి మాట నేనయ్యేందుకు !
నీ కనులకి కంటి పాపనై ,కనుపాపకి కమ్మని కలనై ,కలలో కలల దేవతనై ,నీ కళ్ళలోనే నా రూపాన్ని నింపి ఉంచా ...
నీ లోకమే నేనయ్యేందుకు !నా లోకమే నువ్వని చెప్పేందుకు !!